బ్రహ్మముడిలో కొత్త ట్విస్ట్.. రాహుల్-వెన్నెల పెళ్ళికి అరుంధతి అంగీకారం!
on May 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-103 లో.. రాజ్ ఆఫీస్ కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ చూసి, లెక్కల్లో తేడా ఉంది.. చాలా ఎక్కువ మొత్తం డబ్బుని రాహుల్ తీసుకున్నాడని అతడిని పిలిచి అడుగుతాడు. ఇన్ని రోజులు నన్నేమి అనలేదు.. ఈ కావ్య మాటలు పట్టుకొని నన్ను అనుమనిస్తున్నావా రాజ్ అని చెప్పేసి వెళ్లిపోతాడు రాహుల్. ఆ తర్వాత తను నిజాన్ని దాస్తున్నాడని రాజ్ తో కావ్య చెప్పగా.. ఇవి మా ఆఫీస్ విషయాలు మధ్యలో నువ్వు కలుగజేసుకోకని రాజ్ చెప్తాడు.
దుగ్గిరాల ఇంటికి అపర్ణ స్నేహితురాలు అరుంధతి తన కూతురితో కలిసి వస్తుంది. వాళ్ళని చూసి అందరూ మర్యాదగా పలికరిస్తారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరిని అపర్ణ పరిచయం చేస్తుంది. కాసేపటికి కావ్య వాళ్ళిద్దరికి టీ తీసుకొని వస్తుంది. ఆ టీ తాగిన అరుంధతి.. టీ చాలా బాగుంది.. నీ చేతి టీ కోసమైనా రోజు వస్తానని అరుంధతి అనగా.. సరే మేడం అని కావ్య అంటుంది. ఇలాంటి సర్వెంట్ దొరకడం మీ అదృష్ణం అని అరుంధతి చెప్పి తనకి టిప్ ఇస్తుంటుంది. నాకొద్దు మేడం.. ఇది నా ధర్మం అని కావ్య అంటుంది.
ఆ తర్వాత కావ్యని అపర్ణ లోపలికి వెళ్ళమని చెప్తుంది. అయితే కావ్యని రుద్రాణి ఆపి.. తను రాజ్ భార్య కావ్య అని అరుంధతికి చెప్తుంది. అయ్యో సారీ అమ్మా నాకు తెలియదని అరుంధతి అంటుంది. మరి అపర్ణ నువ్వైనా చెప్పాలి కదా అనవసరంగా ఆమెని తప్పుగా అనేసాను.. ఎంత బాధపడుతుందో తను అని అరుంధతి అనగా.. ఏం పర్లేదు మేడం మీకోసం స్నాక్స్ తీసుకొస్తానని కావ్య చెప్పేసి కిచెన్ లోకి వెళ్తుంది. తను నీ భార్య అని చెప్పాలి కదా రాజ్.. ఇది కరెక్ట్ కాదు అని అరుంధతి అంటుంది. ఆ తర్వాత రాజ్ కిచెన్ లోకి వెళ్ళి.. మంచి బట్టలు కట్టుకోవచ్చు కదా.. తన చేత నన్ను ఇప్పుడు తిట్టించాలా అని కావ్యతో రాజ్ అంటాడు. మీ లెవెల్ కోసం నాకు చీరలు కొనిచ్చారు కానీ ప్రేమతో కొనివ్వలేదు.. నేను ఆ చీరలు కట్టుకోనని కావ్య అంటుంది.
మీరెప్పుడు అయితే ప్రేమతో నాకు చీర కొనిస్తారో అప్పుడే కట్టుకుంటానని కావ్య అనగా.. అది ఏ జన్మలోను జరుగదని ఈ జన్మలో నువ్వు గుర్తుపెట్టుకో అని రాజ్ అంటాడు. అయితే నేనెప్పటికి మీరిచ్చిన చీరలు కట్టుకోనని కావ్య అంటుంది. కాసేపటికి ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది. అప్పుడే రాజ్ కావ్య చేతిని పట్టుకోగా పొరపాటున గ్యాస్ బర్నర్ పైకి కావ్య చేతు వెళ్తుంది. దాంతో కావ్య చేయి కాలిపోతుంది. అది చూసిన ధాన్యలక్ష్మి.. కాల్చాడా.. వీళ్ళు మారరు.. చెప్పింది చేయకుంటే ఇలాగే కాలుస్తారా అని రాజ్ తో ధాన్యలక్ష్మి అంటుంది. నేనేం చేయలేదు పిన్ని.. నువ్వైనా నిజం చెప్పని కావ్యని రాజ్ అంటాడు.
ఇప్పుడు తను కాల్చాడని చెప్తే రాత్రి నాకు టార్చర్ చూపిస్తాడని ధాన్యలక్ష్మితో కావ్య అంటుంది. ఇంట్లో గెస్ట్ లు లేకుంటే పంచాయతీ పెట్టించేదాన్నని రాజ్ తో ధాన్యలక్ష్మి అంటుంది. మరోవైపు కనకం-కృష్ణమూర్తిల ఇంటికి స్వప్న క్లాస్ మేట్ అరుణ్ వచ్చి.. స్వప్నని పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు. అయితే నువ్వు నా ఫ్రెండ్ అంతే నాకు అలాంటి అభిప్రాయం లేదని స్వప్న అంటుంది. నువ్వు లోపలికి వెళ్ళు నేను మాట్లాడతానని స్వప్నతో కనకం అంటుంది. మరోవైపు అరుంధతితో ఇందిరాదేవి మాట్లాడుతుంది. ఆ తర్వాత లోపలికి వచ్చి అందరికీ శుభవార్త అని ఇందిరాదేవి చెప్తుంది. అరుంధతి కూతురు వెన్నెలని మన రాహుల్ కి ఇచ్చి పెళ్ళి చేయడానికి అరుంధతి ఒప్పుకుందని ఇందిరాదేవి అంటుంది. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా రాహుల్ అని అరుంధతి అడుగగా.. అప్పుడే రాహుల్ కి స్వప్న కాల్ చేస్తుంది. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా సమాధానం రాలేదేంటని అరుంధతి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read